సోనూసూద్‌కు కరోనా నెగిటివ్..ఆనందంలో ఫ్యాన్స్..!
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే అంతే త్వరగా కోలుకుంటున్నారు కూడా. ఇది శుభ పరిణామం. తాజాగా రియల్ హీరో, నటుడు సోనూ సూద్ కూడా కరోనా నుంచి బయటపడ్డాడు.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే అంతే త్వరగా కోలుకుంటున్నారు కూడా. ఇది శుభ పరిణామం. తాజాగా రియల్ హీరో, నటుడు సోనూ సూద్ కూడా కరోనా నుంచి బయటపడ్డాడు. గత ఏడాది కాలంగా ఎంతో మందికి సాయం చేస్తున్న ఈయన.. కొన్ని రోజుల కింద కోవిడ్ బారిన పడ్డాడు. ఆచార్యతో పాటు మరి కొన్ని సినిమాలతో బిజీగా ఉన్న సోనూ సూద్ అక్కడే వైరస్ బారిన పడ్డాడు. తనకు పాజిటివ్ వచ్చిన విషయం తెలియగానే వెంటనే క్వారంటైన్ లోకి వెళ్ళిపోయాడు.
అంతే కాదు క్వారంటైన్ లో ఉండి కూడా తనకు తాను ధైర్యం చెప్పుకోవడమే కాకుండా.. బయట జనానికి కూడా ధైర్యం చెప్పాడు సోను సూద్. తనకు పాజిటివ్ వచ్చిన రోజు సోనూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈయనకు పాజిటివ్ వచ్చిందనే విషయం తెలుసుకుని అభిమానులు చాలామంది కంగారు పడ్డారు. సోషల్ మీడియాలో ఎలా ఉన్నారు అంటూ ఆయన ఆరోగ్యం కోసం ఆరా తీశారు. దీనికి సోనూ సూద్ ఇచ్చిన సమాధానం కూడా అదిరిపోయింది.
జనం నన్ను అడుగుతున్నారు ఎలా ఉన్నారు అని.. నేను బాగానే ఉన్నా కానీ కరోనా ఇబ్బంది పడుతుంది అంటూ సరదా సమాధానమిచ్చాడు ఈ నటుడు. తాజాగా ఆయన కరోనా నెగిటివ్ అంటూ మరో ట్వీట్ చేశాడు. ఇది చూసిన తర్వాత అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే తాను కరోనాతో బాధ పడుతూ కూడా బయట సాయం కోసం వేచి చూస్తున్న వేలాది మందికి అండగా నిలబడ్డారు సోనూసూద్.
ఇవి కూడా చదవండి..
కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

