కరోనా కష్టకాలంలో ఎంతో మందికి తన వంతు సాయం అందిస్తూ అందరి మనసులు గెలుచుకున్నాడు సోనూసూద్. కోవిడ్ సమయంలో ఆపన్నులకు అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ తన సహాయ కార్యక్రమాలను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ అందించి ప్రాణదాతగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ కు గుడులు కూడా కట్టారు.
సమస్య ఉందంటే వెంటనే అందరికి గుర్తొచ్చే పేరు సోనూసూద్. ఆయన సొల్యూషన్‌లా మారడంతో ఆయనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోయింది. ఈ క్రమంలో సోనూసూద్ ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 10 మిలియన్లు (కోటి) దాటింది. అయితే పెద్ద పెద్ద స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ సోనూసూద్‌కి ఉందని చెప్పాలి.
సోనూసూద్ ప్రస్తుతం తెలుగులోను పలు సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటించిన ఆచార్య చిత్రం ఫిబ్రవరిలో విడుదల కావలసి ఉంది. ఈ చిత్రంలో సోనూసూద్ పాత్రను మార్పించి షూటింగ్ చేయించాడట చిరంజీవి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.