Varudu Kavalenu | మధురమైన హృదయమా

నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మీసౌజన్య దర్శకురాలు. ఈ చిత్రంలోని ‘మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమ..పెదవిదాటి వెలికిరాక బెదురెందుకె హృదయమా’ అనే గీతాన్ని బుధవారం చిత్రబృందం విడుదలచేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను చిన్మయి ఆలపించింది. విశాల్ చంద్రశేఖర్ స్వరకర్త. నిర్మాత మాట్లాడుతూ ‘నాయకానాయికల మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని ఆవిష్కరిస్తూ హృద్యంగా సాగే గీతమిది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్యాలను సమకూర్చారు. సంగీతప్రియులకు చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం’ అని తెలిపారు. నదియా, మురళీశర్మ, అనంత్, కిరీటి దామరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: గణేష్‌కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

