ఒకప్పుడు టాలీవుడ్లో చక్రం తిప్పిన ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా..?

sonali bendre | ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్లు ఉంది కదా..? మరొకసారి కాన్సంట్రేట్ చేసి చూడండి ఈ హీరోయిన్ ఎవరో మీకు అర్థమవుతుంది మీ ఊహలోకి వచ్చిన ఆ పేరు కరెక్టే. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో వరుసగా నటించి సంచలన విజయాలు అందుకున్న ఆ హీరోయిన్ సోనాలి బింద్రే. ప్రేమికుల రోజు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. మహేశ్ బాబు హీరోగా నటించిన మురారి సినిమాతో నేరుగా తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఆ తర్వాత దాదాపు నాలుగేళ్ల పాటు వరుసగా సినిమాలు చేసింది సోనాలి బింద్రే. ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, శంకర్‌దాదా ఎంబీబీఎస్ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. కానీ అప్పుడే సోనాలి బింద్రే జీవితంలో మరో దశ మొదలైంది. క్యాన్సర్ బారిన పడి దాదాపు నాలుగేళ్ల పాటు ఆ మహమ్మారితో పోరాటం చేసింది. ఒకానొక దశలో ఆమె ఆరోగ్యం పూర్తిగా విషమించింది కూడా. లండన్ వెళ్లి అక్కడే ఆరు నెలలకు పైగా ఉండి చికిత్స తీసుకుని చివరకు క్యానర్స్‌ను జయించింది సోనాలి బింద్రే. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడు సోనాలి బింద్రే మళ్లీ బుల్లితెరపై కనిపిస్తుంది. హిందీలో పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తుంది. ఈ సందర్భంగానే ఆమె మేకప్ చేసుకుంటున్న ఒక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన తర్వాత సోనాలి బింద్రే అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. గుర్తుపట్టలేకుండా ఇంతలా మారిపోయిందేంటని షాకవుతున్నారు. ఇదిలా ఉంటే మంచి కథ దొరికితే తెలుగులో నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అని కూడా సోనాలి బింద్రే గతంలో చెప్పింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
RRR: ఐటెం సాంగ్ ఉందా మావా అని అడిగిన నెటిజన్.. నువ్వు చేస్తావా అంటూ ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్
Disha patani: లోఫర్ బ్యూటీకి సర్జరీ వికటించిందా?
Samantha: ఈ ఏడాది నాకు చాలా క్లిష్టమైన సంవత్సరం అంటూ సమంత కామెంట్
Bheemla Nayak: భీమ్లా నాయక్ కన్నా ముందు చిత్ర టైటిల్ ఏమని అనుకున్నారో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
Road accident | గద్వాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
SCENE Trailer | ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచుతున్న సూర్య-నస్లెన్ మైండ్ గేమ్!
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

