e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News RRR: ఐటెం సాంగ్ ఉందా మావా అని అడిగిన నెటిజ‌న్.. నువ్వు చేస్తావా అంటూ ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్

RRR: ఐటెం సాంగ్ ఉందా మావా అని అడిగిన నెటిజ‌న్.. నువ్వు చేస్తావా అంటూ ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్

చ‌రిత్ర సృష్టించేందుకు ఆర్ఆర్ఆర్ సినిమా సిద్ధ‌మ‌వుతుంది. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.భారీ బడ్జెట్.. స్టార్ నటీనటులు.. బాలీవుడ్, హాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టీవల విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతుండ‌గా, సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది.

జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానున్న ఈ సినిమాకి అంద‌రిలో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉండ‌గా, ఒక్కొక్క‌రు ఒక్కోలా ఊహించుకుంటున్నారు. తాజ‌గా ఓ నెటిజ‌న్.. సినిమాలో ఐటం సాంగ్ ఉందా మావా అని ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన చిత్ర బృందం…ఏ నువ్వు చేస్తావా అంటూ ఫ‌న్నీ రిప్లై ఇచ్చింది. గ‌తంలో కూడా ఇలా ఫ‌న్నీ రిప్లైలు ఇవ్వ‌డం మ‌నం చూశాం. తాజా ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

- Advertisement -

బాహుబలి తరువాత ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంతో సహ అనేక బాషల్లో తెరకెక్కుతున్న సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కోసం ఎస్ఎస్ రాజమౌళి ఇప్ప‌టి నుండే జోరుగా స‌న్నాహాలు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement