బాలీవుడ్ (Bollywood) నటి సోనాక్షిసిన్హా (Sonakshi Sinha) నటుడు జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal)తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఏదో ఒక సందర్భంలో కనిపిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే సోనాక్షి సిన్హా తన చేతి వేలికి (engagement ring) ఉంగరం పెట్టుకుని, ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.నాకు ప్రత్యేకమైన రోజు. నా అతిపెద్ద కలలలో ఒకటి ఇపుడు నెరవేరుతుంది. మీతో ఆ విషయాన్ని చెప్పకుండా వెయిట్ చేయలేను..అంటూ క్యాప్షన్ పెట్టింది.
ఇంకేముంది సోనాక్షికి నిశ్చితార్థం పూర్తయిందంటూ శుభాకాంక్షలు చెప్పే మునిగిపోయారు అభిమానులు. అయితే అదంతా ఉత్తదే అని తేలిపోయింది. ఇంతకీ అసలు విషయమేంటంటే సోనాక్షి సిన్హా నెయిల్ ఆర్ట్ బ్రాండ్ బిజినెస్‌ను లాంఛ్ చేసింది. ఒకే ఒకే..నేను మిమ్మల్ని చాలా టీజ్ చేశాననుకుంటున్నా. ఎన్నో హింట్స్ ఇచ్చాను. ఒక్క అబద్దం కూడా ఆడలేదు. నాకు బిగ్ డే ఎందుకున్నానంటే.నా సొంత బ్రాండ్ (SOEZI) లాంఛింగ్ చేస్తునందుకే. ప్రతీ అమ్మాయి గోళ్లు అందంగా మెరవాలంటే ఒకే ఒక్క స్టాప్ షాప్ ఇది. రోజంతా..ప్రతీ రోజు..అంటూ పోస్టులో క్లారిటీ ఇచ్చింది సోనాక్షిసిన్హా.
నిజానికి నేను నా కొత్త ప్రేమను చాటుకుంటున్నాను – నా @itssoezi నెయిల్స్ స్టిల్స్ తో… మీరు ఏమనుకున్నారు? హ..హ..హ..హ లవ్ యూ అబ్బాయిలు. ఎల్లప్పుడూ అపారమైన మద్దతు అందిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ ముగించింది సోనాక్షి. మొత్తానికి సోనాక్షి ఇలా మరో పోస్టు పెట్టడంతో ఫూల్స్ అయిపోయామని ముక్కున వేలేసుకుంటున్నారు ఫాలోవర్లు.