Ajay Devgn | బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సన్ ఆఫ్ సర్దార్ (Son Of Sardaar 2). విజయ్ కుమార్ అరోరా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాల్ థాకుర్ కథానాయికగా నటించబోతుంది. రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న(Maryada Ramanna) సినిమాను హిందీలో సన్ ఆఫ్ సర్దార్ (Son Of Sardaar) అని రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సినిమాకు సన్ ఆఫ్ సర్దార్ 2 అంటూ సీక్వెల్‌ను తీసుకువస్తున్నారు మేకర్స్.
ఇప్పటికే ఫస్ట్‌లుక్‌తో పాటు ట్రైలర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాను మొదటగా జూలై 25న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన చిత్రబృందం అనుకోని కారణాల వలన వారం వాయిదా వేసింది. దీంతో ఈ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ నుంచి కొత్త ట్రైలర్‌ను పంచుకుంది. దుజా (Duja) అనే పేరుతో కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది.