Nora Fatehi | బాలీవుడ్ (Bollywood)లో అందం, అభినయంతో కిక్కెక్కించే డ్యాన్సింగ్ క్వీన్స్ జాబితాలో టాప్‌లో ఉంటుంది నోరా ఫతేహి (Nora Fatehi). బాహుబలి ఫస్ట్ పార్టులో మనోహరి సాంగ్‌లో మెరిసి తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. ఆ తర్వాత లోఫర్, ఊపిరిలో స్పెషల్ సాంగ్స్‌లో కనిపించిన ఈ భామ ప్రస్తుతం వరుణ్ తేజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ మట్కాలో నటిస్తోంది. స్పెషల్ సాంగ్స్‌తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ కొంతమంది హిందీ యాక్టర్ల పెళ్లిళ్ల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నోరా ఫతేహి మాట్లాడుతూ.. కొంతమంది హిందీ యాక్టర్లు కేవలం బాలీవుడ్లో తమ నెట్‌వర్క్‌ను పెంచుకునేందుకే పెళ్లిళ్లు చేసుకుంటారంది. కపుల్ మధ్య ప్రేమ లాంటిదేమి ఉండదు. తమ కెరీర్లో ముందుకెళ్లడానికి, వారి నెట్‌వర్క్‌ను పెంచుకునేందుకు కపుల్ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. నా ఇండస్ట్రీలో ఇది చూశా. కొందమంది జనాలు పలుకుబడి కోసం పెళ్లి చేసుకుంటారు.
కొందరు నటీనటులు తమ భార్యలు లేదా భర్తలను తమ తమ సర్కిల్స్‌లో, డబ్బు, పరపతి కోసం నెట్వర్క్ పెంచుకునేందుకు వాడుకుంటారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఇటీవలే ముంబై ఎయిర్‌పోర్టులో బ్లూ షర్ట్, ప్యాంట్లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇవ్వగా… నోరా ఫతేహిని తమ తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు. ఇప్పటికే ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ మట్కా (Matka)లో నోరాఫతేహి వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రాబోతుంది. నోరాఫతేహి మరోవైపు Madgaon Express, Crakk చిత్రాల్లో కూడా నటిస్తోంది.
ఎయిర్‌పోర్టులో నోరాఫతేహి..
Jet-setting in style: Nora Fatehi rocks a chic blue outfit, black sunglasses, and a statement handbag at the airport ✈️🕶️👜 #NoraFatehi #DeepikaPadukone #SalmanKhan #AliaBhatt #DishaPatani #SaraAliKhan #KiaraAdvani #KrithiShetty #TamannaahBhatia #KanganaRanaut #viralvideo #WATCH pic.twitter.com/wNUSuNiwAB
— Jadolya (@JadolyaNews) September 21, 2023
బీచ్‌లో నోరా ఫతేహి షికారు ..
.#NoraFatehi celebrates her birthday in Dubai and shares this cool video pic.twitter.com/BcMtwPtFQx
— Faridoon Shahryar (@iFaridoon) February 6, 2023