సయ్యద్ సొహైల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవయూర్ నాయికగా నటిస్తున్నది. మైక్ మూవీస్ నిర్మాణంలో నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మాతలు. మదర్స్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.
అమ్మ గొప్పతనం చెబుతూ సాగిందీ వీడియో. ‘తొమ్మిది నెలల కష్టాన్ని సంతోషంగా భరిస్తూ.. ప్రాణాలకు తెగించి బిడ్డకు జన్మనిస్తారు. ఆడవాళ్లు గ్రేట్ సార్’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ ఉద్వేగపూరితంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ : నిజార్ షఫీ, సంగీతం : శ్రావణ్ భరద్వాజ్.