నటిగా దేశవ్యాప్తంగా చక్కటి గుర్తింపు తెచ్చుకున్న శోభితా ధూళిపాళ్ల.. ఇప్పుడు గృహిణిగా కూడా పదుగురి ప్రశంసలందుకుంటున్నారు. పెళ్లయ్యాక ఆమె కట్టుబొట్టు.. నడవడికపై అందరూ పాజిటీవ్‌గా స్పందిస్తున్నారు. అక్కినేని కోడలంటే ఇలా ఉండాలంటూ అభిమానులు కితాబులిచ్చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన స్కూల్‌డేస్ గురించి ఆసక్తికరమైన విశేషాలను వెల్లడించారు శోభిత. స్కూల్‌డేస్‌లో శోభిత ఓ అబ్బాయిని ఇష్టపడ్డారట. కానీ ఆ అబ్బాయి మాత్రం తనవైపు అస్సలు చూసేవాడు కాదట.
అతని ప్రవర్తన తననెంతో బాధించేదనీ, ఎలాగైనా అతని చూపు తనపైపు తిప్పుకోవాలని స్కూల్లో వ్యాసరచన లాంటి పోటీలపై దృష్టి పెట్టాననీ, అది నేర్చుకునే క్రమంలో తన మెచ్యూరిటీ లెవల్స్ పెరిగాయని, తానే ఆ అబ్బాయిని చూడటం మానేశానని శోభిత వెల్లడించారు. కాలేజ్ రోజుల్లో కూడా తనకు చాలా ప్రపోజల్స్ వచ్చాయట. తాను కూడా కొన్ని ప్రేమలేఖలు రాశారట. ఇలా తన మనసును పరిపూర్ణంగా ఆవిష్కరించారు శోభితా ధూళిపాళ్ల. ప్రస్తుతం ఆమె ‘గూఢచారి2’లో నటిస్తున్న విషయం తెలిసిందే.