న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani).. మళ్లీ టీవీ షోల్లో నటిస్తోంది. రాజకీయాల్లోకి రాకముందు .. క్యోంకి సాస్ బీ కబీ బహు తి .. టీవీ సీరియల్లో స్మృతి నటించేది. అయితే ఫుల్ టైం రాజకీయాల్లోకి వచ్చాక ఆమె ఆ షోకు బ్రేక్ వేసింది. ఇప్పుడు మళ్లీ క్యోంకి సాస్ బీ కబీ బహు తీ షోలో నటిస్తోంది. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. క్యోంకి సాస్ బీ కబీ బహు తీ సీరియల్ 2000 నుంచి 2008 మధ్య ప్రసారమైంది. ఏడేళ్ల పాటు వరుసగా ఆ సీరియల్ నెంబర్ వన్ స్పాట్లో ఉన్నది.
తులసీ వీర్వాని పాత్రలో స్మృతి ఇరానీ నటిస్తోంది. ఫస్ట్ లుక్ డ్రెస్సులో.. స్మృతి మెరూన్ రంగు చీరలో ఉన్నది. జరీ పట్టు బోర్డర్ ఉన్న చీరను ఆమె ధరించింది. చాలా పెద్ద సైజులో ఉన్న ఎరుపు రంగ బొట్టు పెట్టుకున్నది. బంగారు ఆభరణంతో పాటు బ్లాక్ బీమ్ మంగళసూత్రాన్ని ఆమె ధరించింది. వీ ద వుమెన్ షోలో బర్కా దత్త, కరణ్ జోహార్ తో మాట్లాడుతూ తన పాత్ర గురించి ఆమె తెలిపారు.
క్యోంకి సాస్ బీ కబీ బహు తీ షోలో నటించాలన్న ఒప్పందం ఉందని, 2014లో మళ్లీ ఆ సిరీయల్ చేయాలన్న ఒప్పందం ఉంది అని, కానీ పార్లమెంట్‌కు ఎన్నిక కావడం వల్ల టీవీ షో ఒప్పందాన్ని బ్రేక్ చేయాల్సి వచ్చిందన్నారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయాలని పీఎంవో ఆఫీసు నుంచి కాల్ రాగానే తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఆమె వెల్లడించారు. టీవీ, సినిమాల్లో నటించడం కన్నా.. దేశానికి సేవ చేయడం గొప్ప విషయం అవుతుందని రిషి కపూర్ చెప్పిన మాటల్ని ఆమె గుర్తు చేశారు.