రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘స్కంద’. బోయపాటి శ్రీను దర్శకుడు. చిట్టూరి శ్రీనివాస్ నిర్మాత. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఇటీవల విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది.
చిత్ర ప్రమోషన్స్‌ను కూడా మొదలుపెట్టాం. బోయపాటి మార్క్ మాస్ కథాంశానికి కుటుంబ భావోద్వేగాలు జోడించి రూపొందిస్తున్న చిత్రమిది. ముఖ్యంగా చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ అంచనాలకు మించి వుంటాయి. అత్యున్నత నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’ అన్నారు.