గోటికి చేటు కావొద్దంటే
గోళ్లు అందంగా కనిపించడానికి నెయిల్ పాలిష్‌ను ఆశ్రయిస్తారు. సందర్భానికి తగ్గట్టుగా తీరొక్క రంగులతో వాటిని తీర్చిదిద్దుతారు. అయితే, ఆ రంగులను తొలగించడానికి నానా అవస్థలు పడతారు. రసాయనాలతో నిండిన నెయిల్‌పాలిష్ రిమూవర్‌ను ఉపయోగిస్తుంటారు.
గోళ్లు అందంగా కనిపించడానికి నెయిల్ పాలిష్‌ను ఆశ్రయిస్తారు. సందర్భానికి తగ్గట్టుగా తీరొక్క రంగులతో వాటిని తీర్చిదిద్దుతారు. అయితే, ఆ రంగులను తొలగించడానికి నానా అవస్థలు పడతారు. రసాయనాలతో నిండిన నెయిల్‌పాలిష్ రిమూవర్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే, వీటిని ఎక్కువగా వాడటం వల్ల గోళ్ల ఆరోగ్యం దెబ్బతింటుందని సౌందర్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయనాలకు
బదులుగా.. సహజసిద్ధంగానే గోళ్ల రంగులను తొలగించుకోవచ్చని చెబుతున్నారు.
- నెయిల్ పాలిష్‌ను తొలగించడంలో నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం, కొద్దిగా సోప్ లిక్విడ్ కలపాలి. ఈ నీటిలో చేతులను ముంచి.. నాలుగైదు నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నిమ్మకాయ తొక్కతో గోళ్లపై సున్నితంగా రుద్దాలి. అంతే.. నెయిల్ పాలిష్ చిటికెలో వదిలిపోతుంది.
- సాధారణ తెల్లని టూత్‌పేస్ట్‌తోనూ నెయిల్ పాలిష్‌ను తొలగించుకోవచ్చు. గోళ్లపై కొద్దిగా టూత్ పేస్ట్‌ను రాసి.. బేకింగ్ సోడా చల్లాలి. కొద్దిసేపు మెల్లగా రుద్ది.. కాసేపటి తర్వాత తడి కాటన్‌తో తుడిచేస్తే సరి.
- ఉడకబెట్టిన బంగాళదుంప తొక్కను నిమ్మరసం, చక్కెరతో కలిపి గోళ్లపై రాయాలి. కాసేపాగి కాటన్ వస్త్రంతో రుద్దేస్తే.. నెయిల్ పాలిష్ పోతుంది.
- గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల వెనిగర్ కలపాలి. అందులో గోళ్లను ముంచి.. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచేయాలి. ఆ తర్వాత బయటికి తీసి.. నిమ్మతొక్కతో గోళ్లను బాగా రుద్దాలి. ఇలా చేస్తే నెయిల్ పాలిష్ తేలికగా రాలిపోతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

