Skanda Movie | వినాయక చవితి స్లాట్‌ను ముందుగా బుక్ చేసుకున్న సినిమా స్కందనే. అన్ని కుదిరితే ఈ పాటికే బీ, సీ సెంటర్ల థియేటర్లు దద్దరిల్లిపోయేయి. అయితే అనూహ్యంగా సినిమాను రెండు వారాలు పోస్ట్ పోన్ చేశారు. కారణాలు ఏంటో తెలియట్లేదు కానీ రిలీజ్ పోస్ట్ పోన్ అవడం ఈ సినిమాకు పెద్ద దెబ్బ పడింది. ఎందుకంటే ఈ వారం లాంగ్ వీకెండ్ వచ్చింది. మూడు రోజల వీకెండ్‌తో పాటు సోమవారం వినాయక చవితి హాలీడే బాగా కలిసి వచ్చింది. కానీ ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది. జరిగిందేదో జరిగిపోయింది అని విషయాన్ని పక్కన పెట్టేస్తే.. స్కంద సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు మాస్ ఆడియెన్స్‌లో భీభత్సమైన అంచనాలు క్రియేట్ చేసింది.
ఇక చిత్రబృందం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి అంచనాలు పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమాలో కల్ట్ మామా అంటూ ఓ ఐటెం సాంగ్ అప్డేట్ను వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 18న ఈ ఊర మాస్ పాటను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ ఐటెం గర్ల్ ఊర్వశి రౌటెలా నర్తించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్‌తో పాట ఊరమాస్‌గా ఉండబోతున్నట్లు క్లారిట వచ్చేసింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఈ స్పెషల్ సాంగ్ కూడా ఆ చార్ట్ బస్టర్ లిస్ట్‌లో చేరుతుందని మేకర్స్ తెలుపుతున్నారు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా నార్త్‌లో మంచి హైప్‌తో రిలీజవుతుంది. ఇక అదే రోజున చంద్రముఖి-2 కూడా రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకైతే ఈ సీక్వెల్‌పై జనాల్లో పెద్దగా అంచనాల్లేవు. దానికి తోడు ట్రైలర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే హార్రర్ జోనర్ కాబట్టి ప్రేక్షకులు కాస్త కనెక్ట్ అయినా బంపర్ హిట్టు చేసేస్తారు.
CULT MODE 🔛🥁🥁🥁🥁🥁🥁#CultMama Arrives on Sept 18th 🔥🔥🔥🔥#SkandaOnSep28
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @UrvashiRautela @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake @StunShiva8 @ZeeStudios_ @lemonsprasad @VarnikhaVisuals… pic.twitter.com/j3tUPSmxFs
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 16, 2023