Siva Karthikeyan Don Movie On OTT | తమిళ హీరో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన కార్తికేయన్ గతేడాది విడుదలైన ‘డాక్టర్’ సినిమాతో టాలీవుడ్లో మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలోనే ఈయన నటించిన ‘డాన్’ తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలైంది. సిబి.చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతవారం విడుదలై పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. పోటీగా ‘సర్కారు వారి పాట’ సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్నా ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్లను సాధిస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కలిపి 50కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. కేవలం 4రోజుల్లోనే ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించిందంటే విశేషం అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్దమైంది.
రొమాంటిక్ కామెడీ డ్రామాగా విడుదలైన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’లో జూన్ 10నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మధ్య కాలంలో ఎంతటి భారీ విజయం సాధించినా సినిమా అయినా సరే కేవలం నెల రోజుల్లోనే ఓటీటీలోకి దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే డాన్ చిత్రం కూడా విడుదలైన 4వారాల్లోనే ఓటీటీలో ప్రదర్శితం కానుంది. అనురుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో శివకార్తికేయన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. లైకా ప్రొడక్షన్ సంస్థతో కలిసి శివ కార్తికేయన్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.