Siva Karthikeyan Don Telugu Trailer | తమిళ హీరో శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘రెమో’ సినిమాతో తెలుగులో ఈయనకు మంచి క్రేజ్‌ను వచ్చింది. గతేడాది విడుదలైన డాక్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అంతేకాకుండా ఈ చిత్రంతో తెలుగులో ఈయనకు మంచి మార్కెట్ ఏర్పడింది. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం డాన్. సిబి చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 13న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఇదివరకే ఈ సినిమా ట్రైలర్‌ను తమిళంలో విడుదలై విశేష స్పందన తెచ్చుకుంది. ఇక తాజాగా మేకర్స్ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘సర్ టీచర్లే కదా స్టూడెంట్స్‌కు సమస్యగా ఉంటారు.. కానీ ఈ ఒక్క స్టూడెంట్ టీచర్లందరికి సమస్యగా ఉన్నాడు సర్’ అంటూ మొదలైన ట్రైలర్ శివ కార్తికేయన్ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తుంది. ‘అసలు నీ గోల్ ఏంటీ.. నాలో ఉన్న టాలెంట్‌ను కనిపెట్టి లైఫ్‌లో గొప్పోన్ని అవడమే. నేను సైంటిస్ట్‌ను అయిపోనా..పెద్ద కవిని అయిపోనా, పొని మీమ్ క్రియేటర్ అయిపోనా డాన్సర్, క్రికెటర్, గ్యాంగ్ స్టర్ అయిపోనా’ అనే డైలాగ్స్ హీరో లైఫ్‌ను సీరియస్‌గా తీసుకోకుండా ఏమ్ అవ్వాలో అని క్లారిటీ లేకుండా ఉంటాడు. ‘లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఏం చేస్తాడో మీరు ఇన్నాళ్ళు చూపించారు.. లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ప్రిన్సిపల్ అయితే ఏం చేస్తాడో ఇక నేను చూపిస్తా’ అంటూ ఎస్జే సూర్య పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. అనిరుధ్ సంగీతం అకట్టుకుంటుంది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ బ్యానర్‌తో కలిసి శివ కార్తికేయన్ స్వియ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు.