శివ ఆలపాటి, ప్రియాంక శర్మ జంటగా నటిస్తున్న సినిమా ‘డైహార్డ్ ఫ్యాన్’. షకలక శంకర్, రాజీవ్ కనకాల, నోయల్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీహాన్ సినీ క్రియేషన్స్ పతాకంపై చంద్రప్రియ సుబుధి నిర్మిస్తున్నారు. అభిరామ్ ఎం దర్శకుడు.
సెప్టెంబర్ 2న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ ట్రైలర్ బాగుందని, సినిమా కూడా ఆకట్టుకోవాలని సుకుమార్ విషెస్ తెలియజేశారు. నాయిక ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించామని దర్శకుడు అభిరామ్ చెప్పారు.