సీనియర్ నటుడు అర్జున్ సర్జా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ప్రేమకథాచిత్రం ‘సీతా పయనం’. ఐశ్వర్య అర్జున్, నిరంజన్ ప్రధాన పాత్రధారులు. అర్జున్, ధ్రువ సర్జా శక్తివంతమైన పాత్రల్లో కనిపించనున్నారు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు.
సోమవారం ధ్రువ సర్జా పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. యాక్షన్ హల్క్‌గా ఈ పోస్టర్లో ధ్రువ సర్జా కనిపిస్తున్నారు. సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ, ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జి. బాలమురుగన్, నిర్మాణం: శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్.