Sirivennela | అలనాటి దర్శకుడు కే విశ్వనాథ్ సినిమా సిరివెన్నెలకు పాటల రచయిత సీతారామశాస్త్రి. ఈ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి, సినిమా పేరునే ఇంటి పేరుగా నిలుపుకున్నారు. సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, పీ సుశీల ఆలాపించారు.
ఓంకార సంబంధం ఉన్న విధాత తలపున ప్రభవించినది… అనే గీతంలో ఆయన పొదిగిన సాహిత్యం పలువురి ప్రశంసలు అందుకున్నది. ఈ సినిమాలోని ఇతర పాటలలో చందమామ రావే జాబిల్లి రావే, ఆది భిక్షువు వాడినేమి కోరేదీ, బూడిదిచ్చే వాడినేమి అడిగేదీ, ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు, మెరిసే తారలదే రూపం, పొలిమేరు దాటిపోతున్న.. చినుకుచినుకు తదితర గీతాలు విశేషంగా అలరించాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి తొలిసారి ఈ సినిమాకే ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు అందుకున్నారు.