సినిమా పేరుని తన ఇంటి పేరుగా మార్చుకొని ఎన్నో అద్భుతమైన గీతాలు రాసిన రచయిత సిరి వెన్నెల. ఆయన కలం నుండి జారువాలిన ప్రతి అక్షరం ఆణిముత్యమే. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సూపర్, డూపర్ హిట్ సాంగ్స్ అందించిన ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన సీతారామశాస్త్రిని కుటుంబసభ్యులు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.. ఆయనకు కిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది.
సిరి వెన్నెల ఆసుపత్రిలో ఉన్నారని తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందారు. ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్పందించిన సిబ్బంది రెండు రోజుల క్రితం సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యుమోనియాతో బాధపడుతూ హాస్పిటల్లో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
సినీ గేయ రచయితగా సిరివెన్నెల 1986లో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సిరివెన్నెల సినిమాతోనే ఆయన ఫేమస్ అవడంతో.. ఆయన ఇంటిపేరు సిరివెన్నెలగా మారిపోయింది. అదే సినిమాకు ఆయనకు ఉత్తమ లిరికిస్ట్‌గా నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఆయన తెలుగులో వందల సినిమాలకు పాటలు రాశారు.