బీబీ ఎక్స్‌ప్రెస్ టాస్క్‌లో భాగంగా షణ్ను పాజ్‌లో ఉన్నప్పుడు హౌస్మేట్స్ అతడికి గర్భవతి వేషం వేయగా, సిరికి మీసాలు దించి ఆటపట్టించారు. అదే సమయంలో సిరి తల్లి శ్రీదేవి హౌజ్‌లోకి వచ్చారు. ఆమె తన కూతురు, షణ్ముఖ్లకి గట్టిగానే క్లాస్ పీకింది. సిరి తండ్రి లేని పిల్ల. చిన్నప్పుడే వాళ్ల డాడీ చనిపోయారు. చిన్న పాన్‌షాప్ పెట్టి ఆమెను చదివించాను. ఎన్నో మాటలు పడ్డాను. కష్టపడి చదివించినందుకు నా పిల్లలు నాకు మంచి పేరు తెచ్చారు. సిరి తల్లిగా నన్ను గుర్తిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని శ్రీదేవి అన్నారు.
అయితే షణ్ముఖ్‌ని పదే పదే హగ్‌లు చేసుకోవడం నాకు నచ్చడం లేదని శ్రీదేవి అందరి ముందే చెప్పేసింది. షణ్ముఖ్ ఎక్కువగా సాయం చేస్తున్నందుకు అతనికి బాగా దగ్గర అవుతున్నట్టు ఉంది అని శ్రీదేవి మాట్లాడుతుండగా, సిరి ఆమె తల్లిని పక్కకు తీసుకెళ్లి అలా అనకూడదడంటూ కోప్పడింది. తల్లిగా అనిపించింది చెప్పవలసిన బాధ్యత తనకుందని జవాబిచ్చింది శ్రీదేవి. అయితే శ్రీదేవి మాటలకు షణ్ముఖ్ చాలా హర్ట్ అయ్యాడు.
ఆమె తల్లి మాట్లాడుతున్నప్పుడు సిరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఒంటరిగా కూర్చుని ఏడ్చేశాడు. ఈ హౌస్‌లో ఉండేందుకు తనకు అర్హత లేదని, ఇంకా ఎందుకున్నానో అర్థం కావట్లేదని తనలో తానే కుమిలిపోయాడు. ఇక ప్రియాంక ..మానస్ దూరం పెడుతుండడంపై ఒకింత బాధను వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ మాత్రం అందరినీ టచ్ చేసేలా ఉంది. ఎమోషనల్ ఫన్ రైడ్‌లా ఉంది. నేడు సన్నీ తల్లి రానుంది.