బిగ్ బాస్ తాజా ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ రచ్చగా సాగింది. ఒకరిపై ఒకరు మాటలు దాడి చేసుకున్నారు.ఒకినొక సందర్భంలో కొట్టుకుంటారా అనేలా కనిపించారు. ఎపిసోడ్ మొదట్లో మానస్.. ప్రియాంకకి హితబోధ చేశాడు. . ‘రవి డే 1 నుంచి గేమ్‌లో ఉన్నాడు.. అందుకే హౌస్‌లో ఉన్న వాళ్లతో దగ్గర అవ్వాలనో లేదంటే ఫ్రెండ్ షిప్ చేయాలనో గేమ్ ఆడటం లేదు.. ప్రతి ఒక్కర్నీ బిగ్ బాస్ కంటెస్టెంట్‌గానే చూస్తున్నాడు. ఏది మాట్లాడినా గేమ్ పరంగానే చూస్తున్నాడు’ అంటూ ప్రియాంకకి చెప్పుకొచ్చాడు మానస్.
గుడ్డు కోసం సిరితో రేషన్ మేనేజర్ కాజల్, కెప్టెన్ సన్నీలు చాలాసేపు డిస్కషన్ చేశారు. కెప్టెన్ టాస్క్‌లో అందరూ బయట ఉంటే.. లోపల ఉన్న సిరి, షణ్ముఖ్, శ్రీరామ్‌లు ఎక్స్ ట్రా గుడ్లును తినేయడంతో కాజల్ ఫైర్ అయింది. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న సిరి సడెన్‌గా షణ్ముఖ్‌కి ముద్దు పెట్టింది. దీనికి షాకైన షణ్ముఖ్.. నాకు ఇప్పుడు ఉంటది అని అనుకున్నాడు.
నీ వలన మెంటల్‌గా డిస్ట్రబ్ అవుతున్నా అని సిరి.. షణ్ముఖ్‌తో చెప్పగా, దానికి నా వల్ల చిరాకుగా అనిపిస్తే దూరం పెట్టు అని సింగిల్ డైలాగ్‌లో తేల్చేశాడు. నీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే నేను మాట్లాడనురా, అదే బెస్ట్ అని చెప్పుకొచ్చాడు. దీంతో సిరి మళ్లీ అలిగి వెళ్లిపోయింది.