బిగ్ బాస్ హౌజ్‌లో ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం చాలా కష్టం. నిన్న మొన్నటి వరకు షణ్ముఖ్, సిరి క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. గురువారం మాత్రం సిరి, షణ్ముఖ్‌కు ముద్దు పెట్టడంతో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్‌గామారింది. షన్ను సిరిని ఉద్దేశించి.. మానసికంగా డిస్ట్రబ్ అయినప్పుడు ఎమోషనల్‌గా అటాచ్ అయిపోతాం అని అన్నాడు. దీంతో సిరి నేను బాగానే ఉన్నారా. నీ వల్లే మెంటల్‌గా ఎక్కువ ఇబ్బంది పడుతున్నా అని చెప్పడంతో వెంటనే అయితే నన్ను దూరం పెట్టు అని షన్ను కొంచెం సీరియస్ గానే అన్నాడు. దీంతో సిరి కాసేపు సైలెంట్ అయిపొయింది.
ఫణ్ముఖ్కి సిరి ముద్దు పెట్టినప్పుడు ఆయనలో ఏదో తెలియని సిగ్గు కనిపించింది. కెమెరాల వంక చూస్తూ జాగ్రత్తగా రికార్డ్ చేశారా? నాకు ఉంటదిపుడు అంటూ పేర్కొన్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను చూసిన నెటిజన్లు సిరి-షణ్నూకి ముద్దు పెట్టడం ఏంటని ఆమెపై ఫైర్ అవుతున్నారు. అయితే సిరి అలా ముద్దుపెట్టడంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుండగా, సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ స్పందించాడు. ఇప్పుడేంట్రా నేనే ఏడవాలా? షార్ట్ ఫిల్మ్స్, సినిమాల్లో చేస్తే ఓకే కదా మీకు అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.