Singham 3 | బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit Shetty) సినిమాల్లో ‘సింగం’(Singham) సిరీస్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సిరీస్‌లో తెరకెక్కిన రెండు సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు సింగం-3 (Singham Agian) తెరకెక్కబోతుంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, రణ్వీర్ సింగ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇక రీసెంట్గా సినిమా నుంచి దీపికాతో పాటు, టైగర్ ష్రాఫ్(Tiger Shroff), రణ్వీర్ సింగ్ ఫస్ట్‌లుక్‌లను విడుదల చేయగా.. ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ క్యారెక్టర్ రివీల్ చేశారు.
ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో గన్ పట్టుకుని ఎవరినో కాలుస్తున్నట్లుగా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తుంది. ఇక ఫస్ట్‌లుక్ కరీనా కపూర్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది.
‘SINGHAM AGAIN’: KAREENA PICKS UP A GUN… #RohitShetty unveils #FirstGlimpse of #KareenaKapoorKhan from #SinghamAgain.#AjayDevgn #AkshayKumar #RanveerSingh #DeepikaPadukone #TigerShroff pic.twitter.com/vLlTywZ1LA
— taran adarsh (@taran_adarsh) November 8, 2023
12 ఏండ్ల కిందట వచ్చిన సింగం సినిమా బాలీవుడ్లో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. నిజానికి ఇది సూర్య నటించిన యముడు సినిమాకు రీమేక్. దీనికి కొనసాగింపుగా మూడేళ్లకు సింగం రిటర్న్స్ తెరకెక్కింది. ఇది తొలిపార్టుకు మించి కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక అప్పటికే గోల్మాల్ సిరీస్‌తో రక్షిత్‌శెట్టి-అజయ్ దేవగణ్‌ల కాంబినేషన్ సూపర్ హిట్టు అనిపించుకోగా.. సింగం సిరీస్‌తో తిరుగులేని కాంబినేషన్లా క్రేజ్ తెచ్చుకుంది.