Singham 3 | బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit Shetty) సినిమాల్లో ‘సింగం’(Singham) సిరీస్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సిరీస్‌లో తెరకెక్కిన రెండు సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు సింగం-3 (Singham Agian) తెరకెక్కబోతుంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా లేడీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు మేకర్స్ గతంలోనే రివీల్ చేశారు. ఇక రీసెంట్గా దీపికా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. నోట్లో గన్ను పెట్టి నవ్వుతూ ఉన్న ఫస్ట్‌లుక్ దీపిక ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలో మరో కొత్త పోలీస్ ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమాలో బాలీవుడ్ కుర్ర హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) నటించనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. దీనికి సంబంధించి మేకర్స్ టైగర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఏసీపీ సత్య రోల్లో గన్ను పట్టుకుని నడుస్తూ ఉన్న ఫస్ట్‌లుక్ టైగర్ ష్రాఫ్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూడో పార్ట్‌లో అజయ్ దేవ్‌గణ్‌తో పాటు అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకోనే ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
‘SINGHAM AGAIN’ GETS BIGGER: ROHIT SHETTY SIGNS TIGER SHROFF AS THE NEW COP IN COP UNIVERSE… #RohitShetty expands the cop universe as he welcomes #TigerShroff in the highly anticipated #SinghamAgain… #FirstGlimpse…#SinghamAgain is the third part in #RohitShetty’s… pic.twitter.com/3apjAVbfme
— taran adarsh (@taran_adarsh) October 19, 2023
పుష్కర కాలం కిందట వచ్చిన సింగం సినిమా బాలీవుడ్లో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. నిజానికి ఇది సూర్య నటించిన యముడు సినిమాకు రీమేక్. దీనికి కొనసాగింపుగా మూడేళ్లకు సింగం రిటర్న్స్ తెరకెక్కింది. ఇది తొలిపార్టుకు మించి కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక అప్పటికే గోల్మాల్ సిరీస్‌తో రక్షిత్‌శెట్టి-అజయ్ దేవగణ్‌ల కాంబినేషన్ సూపర్ హిట్టు అనిపించుకోగా.. సింగం సిరీస్‌తో తిరుగులేని కాంబినేషన్లా క్రేజ్ తెచ్చుకుంది.