Simran | అందాల ముద్దుగుమ్మ సిమ్రాన్ సిమ్రాన్.. ఇప్పటి తరానికి తెలీదు కానీ.. అసలు ఒకప్పుడు సిమ్రాన్ అంటే సంచలనం. 90,2000ల దశకాల్లో సిమ్రాన్ అంటే అభిమానులు పిచ్చెక్కిపోయేవారు. హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా సిమ్రాన్ కోసమే ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్లేవారు.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు వంటి హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది సిమ్రాన్. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, కలిసుందాం రా వంటి హిట్ సినిమాలతో తెలుగులో తన స్థాయిని పెంచుకున్న సిమ్రాన్, కోలీవుడ్లోను స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. అయితే ఆమెకి సంబంధించి అనేక గాసిప్‌లు నెట్టింట హల్చల్ చేశాయి.
సిమ్రాన్, ముందుగా విజయ్‌తో ప్రేమలో ఉందని, , ఆ తర్వాత రాజు సుందరం అనే కొరియోగ్రాఫర్‌తో రిలేషన్ పెట్టుకుందని, వారద్దరి మధ్య సీక్రెట్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని, కాకపోతే కొన్ని కారణాల వలన కొన్నాళ్లకే ముగిసిందని టాక్. అయితే సిమ్రాన్ రాజు సుందరంని చాలా గాఢంగా ప్రేమించింది కాని, తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోలేపోయిందని అంటారు. అందుకు దీనిని కారణంగా కూడా చూపిస్తున్నారు. సిమ్రాన్ అప్పట్లో కమల్ హాసన్‌తో వరుస సినిమాల్లో నటించింది. బ్రహ్మచారి, పంచతంత్రం, పమ్మల్ కె.సంబంధం వంటి సినిమాల్లో నటించగా, ఆ సమయంలో కమల్ హాసన్‌తో కూడా రిలేషన్ షిప్ మెయింటైన్ చేసిందనే ప్రచారం నడిచింది.
అయితే బ్రహ్మచారి అనే సినిమాలో కమల్ హాసన్‌తో లిప్‌లాక్ సీన్ చేయడం రాజు సుందరంతో ఆమె సంబంధాన్ని దెబ్బతీసిందని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. సిమ్రాన్‌ను కమల్‌కు దూరంగా ఉండాలని రాజ సుందరం ఆదేశించిన ఆమె కమల్‌తో క్లోజ్‌గా మూవ్ కావడంతోనే రాజ సుందరం బ్రేకప్ చెప్పినట్టు అప్పుడు జోరుగా ప్రచారం సాగింది. మరోవైపు కమల్ హాసన్, సారిక నుంచి విడిపోయిన తర్వాత సిమ్రాన్‌తో ప్రేమలో పడ్డారని, అయితే ఇద్దరి మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలు రావడం వల్ల.. కమల్ హాసన్ తన ప్రేమను గౌతమీతో కంటిన్యూ చేశారనే ప్రచారం కూడా సాగింది. ఇక రాజ సుందరంతో బ్రేకప్ తర్వాత సిమ్రాన్ దీపక్ బగ్గా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో పలు షోలకు సిమ్రాన్ జడ్జీగా వ్యవహరిస్తున్నారు.