Vendhu Thanindhathu kaadu Trailer | తమిళ స్టార్ శింబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘మన్మధ’, ‘వల్లభ’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ఇటీవలే ‘మానాడు’ సినిమాతో సూపర్ హిట్‌ను సాధించాడు. గత కొంత కాలం నుండి వరుస ప్లాప్‌లు వెంటబడుతున్న సమయంలో శింబుకు మానాడు మంచి కంబ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘వెందు తనింధాతు కాదు’ ఒకటి. గౌతమ్ వాసుదేవ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడులైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ఇస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. నిమ్న కులంలో జన్మించిన హీరో తనకు, తన కులానికి గుర్తింపు తీసుకురావాడానికి ఎలాంటి పోరాటాలు చేశాడు? గ్యాంగ్‌స్టర్‌గా మారడానికి అతన్ని ఎలాంటి పరిస్థితులు దారి తీశాయి? అనే నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. మూడు విభిన్న దశలుగా శింబు క్యారెక్టరైజేషన్ ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఏ.ఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని వెల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కె.గణేష్ నిర్మించాడు. శింబుకు జోడీగా సిద్ధి ఇద్నాని హీరోయిన్గా నటించింది. కాగా గతంలో శింబు, గౌతమ్ మీనన్ కాంబోలో తెరకెక్కిన ‘విన్నైతాండి వరువాయా’, ‘అచ్చం యెన్బదు మడమైయడా’ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ క్రమంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం హ్యట్రిక్ సాధిస్తుందని చిత్రబృందం ధీమాగా ఉన్నారు. ఇక ఈ చిత్రం కోసం శింబు 15 కిలోల వరకు తగ్గాడట.