Pathu Thala Movie Teaser | అరవ హీరోల్లో శింబుకు కాస్తో కూస్తో తెలుగులో మంచి క్రేజే ఉంది. ‘మన్మధ’, ‘వల్లభ’ వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా యూత్‌లో ఎక్కడలేని పాపులారిటీ తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత ఈయన సినిమాలు అంత గొప్పగా ఇక్కడ ఆడకపోవడంతో కొంచెం కొంచెంగా జనాలు మర్చిపోయారు. అయితే ‘మానాడు’ సినిమాతో తిరిగి మళ్లీ టాలీవుడ్లో మంచి సినిమా చేశాడు అనే పేరు తెచ్చుకున్నాడు. నేరుగా ఓటీటీలోనే రిలీజైనా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక చాలా రోజుల తర్వాత ‘ముత్తు’తో తెలుగులో థియేటర్లో కనిపించిన శింబు.. అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దాంతో వారం తిరక్కుండానే థియేటర్లను ఖాళీ చేసి వెళ్లిపోయింది.
ప్రస్తుతం శింబు ‘పత్తు తల’ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. చాలా రోజుల తర్వాత శింబు నుంచి అవుట్ అండ్ మాస్ సినిమా రాబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా కన్నడ బ్లాక్ బస్టర్ అయిన మఫ్టీకి రీమేక్‌గా తెరకెక్కింది. కన్నడలో శివరాజ్‌కుమార్ పోషించిన రౌడీ పాత్రను శింబు పోషించాడు. ఒక రౌడీ గురించి ఎంక్వైరీ చేయడానికి మఫ్టీలో వచ్చిన పోలీస్ అధికారి, ఆ రౌడీ గురించి ఏం తెలుసుకున్నాడు. అసలు ఆ రౌడీ కథేంటీ అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. టైటిల్ పోస్టర్ నుంచి సినిమాపై ఎక్కడలేని బజ్ క్రియేట్ అయింది. ఇక టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఎన్ క్రిష్ణ దర్వకత్వం వహించిన ఈ సినిమాలో గౌతమ్ కార్తిక్ కీలకపాత్ర పోషించాడు. స్టూడియో గ్రీన్, పెన్ స్టూడీయోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాడు. ఏ. ఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చాడు. ఇక ఈ సినిమా మార్చి 30న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే తెలుగు రిలీజ్‌పై ఇంకా క్లారిటీ లేదు. ఒక వేళ తెలుగులోనూ రిలీజైతే, నానీ ‘దసరా’తో పోటీ పడాల్సి వస్తుంది.