Sikandar Teaser | సల్మాన్ ఖాన్ సికందర్ టీజర్ వాయిదా.. కారణమిదే..!
Sikandar Teaser | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కాంపౌండ్ నుంచి వస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాల్లో ఒకటి ‘సికందర్’ (Sikandar). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Sikandar Teaser | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కాంపౌండ్ నుంచి వస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాల్లో ఒకటి ‘సికందర్’ (Sikandar). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం టీజర్‌ను ఇవాళ ఉదయం 11:07 నిమిషాలకు లాంచ్ చేయాల్సి ఉంది.
అయితే మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. దేశమంతా సంతాపం ప్రకటిస్తున్న ఈ సమయంలో ఆయన మృతికి సంతాపంగా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నాం. టీజర్‌ను రేపు ఇదే (ఉదయం 11:07) సమయానికి లాంచ్ చేస్తామని అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్.
సికిందర్లో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తుండగా.. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సమాజంలోని అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని ఇన్సైడ్ టాక్.
In light of the passing of our esteemed former Prime Minister Manmohan Singh Ji, we regret to announce that the release of the Sikandar teaser has been postponed to 28th December 11:07 AM. Our thoughts are with the nation during this time of mourning. Thank you for understanding.…
— Nadiadwala Grandson (@NGEMovies) December 27, 2024
Read Also :
Singham Again | అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ను ఇక ఫ్రీగా చూసేయొచ్చు..!
BARROZ | పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫాంలో మోహన్‌లాల్ బరోజ్..!
Hitler Re Release | థియేటర్లలో చిరంజీవి హిట్లర్ సందడి.. రీరిలీజ్ ఎప్పుడంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

