Siddu Gadi Love Story | నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’!
Ramesh Babu Cherukuri | తెలుగు సినిమాపై ఉన్న అపారమైన ప్రేమతో అమెరికా నుంచి వచ్చి దర్శకుడిగా తన కలను నిజం చేసుకుంటున్నారు రమేష్ బాబు చెరుకూరు. ఆయన దర్శకత్వంలో శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.
తెలుగు సినిమాపై ఉన్న అపారమైన ప్రేమతో అమెరికా నుంచి వచ్చి దర్శకుడిగా తన కలను నిజం చేసుకుంటున్నారు రమేష్ బాబు చెరుకూరు. ఆయన దర్శకత్వంలో శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’. బాల బ్రహ్మచారి, శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో సావిత్రమ్మ చెరుకూరు నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 27న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.
అమెరికాలో ఉద్యోగం చేస్తూనే, చిన్ననాటి నుంచి సినిమాపై ఉన్న మక్కువతో రమేష్ బాబు చెరుకూరు ఈ చిత్రాన్ని రూపొందించారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పట్ల తనకున్న అభిమానంతో ఒక ఆకట్టుకునే ప్రేమకథగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ చిత్రంలో మనోజ్ హీరోగా నటించగా, శృతి, మోహన సిద్ధి హీరోయిన్లుగా కనిపించనున్నారు. సీనియర్ నటుడు సుమన్ హీరో తండ్రి పాత్రలో, సర్కార్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ప్రముఖ హాస్యనటులు చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ తెలుగు సినిమాపై ఉన్న ప్రేమతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించానని, టీజర్‌కు వచ్చిన ఆదరణ ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ప్రేక్షకుల ఆశీస్సులతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి దొసాడ యాదగిరి ఛాయాగ్రహణం అందించగా, సీ.ఎన్. ఆదిత్య సంగీతం, లక్కీ ఎక్కరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. తూఫాన్ ఫైట్ మాస్టర్‌గా, రమేష్ బాబు చెరుకూరు, రజని సాగర్ కొరియోగ్రాఫర్లుగా, నాని ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. వై.వి. రావు మేనేజర్‌గా, వి. సాంబశివరావు మేకప్ బాధ్యతలు చూడగా, పాము భాను స్టిల్స్ అందించారు. సునీల్ స్టూడియోస్‌లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రానికి వి. సాంబశివరావు, వేణుగోపాల చారి చెరుకూరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. నవంబర్ 27న విడుదలవుతున్న తమ ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు, మీడియా మిత్రులు ఆదరించాలని చిత్ర బృందం కోరింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srimathi trailer | భావోద్వేగాలతో కూడిన బలమైన సందేశం.. తిరువీర్, నివేదా థామస్ ‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల
జూలూరుపాడులో పోలీసుల నాకాబందీ
Jeevan Reddy | బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్
Devara Part 1 | తారక్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక టీవీలోకి రాబోతున్న దేవర..!
The Breaking News | డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనున్న ‘ది బ్రేకింగ్ న్యూస్’!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

