OG Movie | మరో 5 రోజుల్లో ‘ఓజీ’ సందడి మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా హైప్‌పై పోస్ట్ పెట్టాడు టాలీవుడ్ యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ..
‘‘ఓజీ’ సినిమా హైప్ ప్రభావం మా హెల్త్‌పై పడేలా ఉంది. 25 వరకూ మేం ఉంటామో, పోతామో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక 25 తర్వాత పరిస్థితి ఏంటో?. మీరు పవన్ కాదు.. మీరు గాలి తుపాను అంటూ సిద్ధూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌కి పవన్ కళ్యాణ్‌ని ట్యాగ్ చేశాడు.
#OG HYPE ki health upset ayye la undi . 25th varaku memu untamo pothamo ardham kaatledu. Ippude Ila unte 25th taravaata ento paristhithi. @PawanKalyan garu , YEH PAWAN NAHI , AANDHI HAI . @Sujeethsign this is UNREAL man!!! @priyankaamohan @emraanhashmi sir @MusicThaman bro ,… pic.twitter.com/bzVXOmfXUs
— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) September 20, 2025