DJ Tillu | ప్రస్తుతం డీజే తిల్లు సినిమాకు ఉన్నంత హైప్ ఏ సినిమాకు లేదు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్, డీజే తిల్లు టైటిల్ సాంగ్‌తో సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
ఫిబ్రవరి 12న అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా డీజే తిల్లు సినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలో రిలీజ్ ప్రోమోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సిద్దూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించారు. విమల్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు హీరోగా నటించిన సిద్దూనే డైలాగ్స్ రాశాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు.