Siddharth-Aditi Rao Hydari Dance Video | ఎవర్గ్రీన్ లవర్‌బాయ్ సిద్ధార్థ్, అదితిరావు హైదరీ ప్రేమలో ఉన్నట్లు గతకొంత కాలంగా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రెండేళ్ల క్రితం వచ్చిన ‘మహాసముద్రం’ సినిమాలో వీరిద్ధరూ తొలిసారి కలిసి నటించారు. షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని ప్రచారం జరిగింది. కానీ వీళ్ల రిలేషన్‌పై ఈ జంట ఇప్పటివరకు స్పందించింది లేదు. ఎప్పుడు దీని గురించి ప్రశ్నలు ఎదురైనా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ వస్తున్నారు. అయితే ఈ మధ్య ఈ జంట పలు పార్టీలకు కలిసి వెళ్ళడంతో వీరిపెళ్లి త్వరలోనే అన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవలే శర్వానంద్ ఎంగేజ్మెంట్కు కూడా ఈ జంట కలిసే వెళ్లింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. సిద్ధార్థ్‌తో కలిసి అదితి ఓ పాటకు స్టెప్పులేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ‘ఎనిమీ’ సినిమాలోని ‘టమ్ టమ్’ అనే పాటకు వీరిద్ధరూ కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను అదితి స్వయంగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో పలువురు నెటీజన్లు ‘త్వరలో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టండి’. ‘లేటెందుకు మీ జోడీ చాలా బాగుంది..పెళ్లి చేసుకోండి’. ‘ఎప్పుడు మీ పెళ్లి శుభవార్త చెబుతారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదితి తొలి సినిమాతోనే అందరి మనసు దోచుకుంది. క్యూట్‌లుక్స్‌తో, కట్టిపడేసే నటనతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సిద్ధార్థ్ ఇప్పుడంటే కాస్త డల్ అయ్యాడు గానీ, అప్పట్లో టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగాడు. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వస్తానంటే నేనొద్దంటానా’ వంటి సినిమాలతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక వీరిద్ధరూ త్వరలోనే వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. కాగా వీరిద్ధరికి ఇదివరకే వేరువేరుగా పెళ్లిళ్లు అయి విడాకులు కూడా తీసుకున్నారు.