బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ డ్రగ్ కేసులో పట్టుబడ్డాడు. ఆయన్ని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి నగరంలోని ఓ స్టార్ హోటల్లో జరుగుతున్న రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో సిద్ధాంత్ కపూర్ కూడా ఉన్నారు. డ్రగ్స్ పరీక్షల్లో అతనికి పాజిటివ్ వచ్చింది. దాంతో ఎన్సీబీ అతనిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. సిద్ధాంత్ను రాత్రే ఉల్సూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్న ఉదయం ముంబై నుంచి బెంగళూరు వచ్చిన సిద్ధాంత్ రాత్రి రేవ్ పార్టీ చేసుకున్నారు. అయితే తను బెంగళూరు వెళ్లిన సంగతి తమకు తెలియదని సోదరి శ్రద్ధా కపూర్, తండ్రి శక్తి కపూర్ చెబుతున్నారు.