‘జీ సరిగమప’ టైటిల్ విన్నర్ శృతిక సముద్రాల
హైదరాబాద్: ఇరవై ఆరువారాలపాటు నాన్-స్టాప్ వినోదాన్నిపంచి, ఎంతో మంది అద్భుతమైన సింగర్స్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసి వారి అభిమానాన్నిచూరగొన్న ‘జీ సరిగమప-ది సింగింగ్ సూపర్ స్టార్’ కార్యక్రమం నేటితో ముగిసింది. ఫినాలేలో అదరగొట్టే ప్రదర్శనతో హైదరాబాద్‌కు చెందిన శృతిక సముద్రాల (20) టైటిల్ విజేతగా నిలవగా, తనకు గట్టి పోటీ ఇచ్చిన వెంకటసుధాన్షు రన్నరప్‌గా నిలిచాడు.
ప్రెస్టీజియస్ ‘జీ సరిగమప-ది సింగింగ్ సూపర్ స్టార్’ ట్రోఫీతోపాటు శృతిక లక్ష రూపాయల నగదు మరియు మారుతి సుజుకి వాగన్-ఆర్ కారుని బహుమానంగా అందుకుంది. రన్నరప్‌గా నిలిచిన వెంకట సుధాన్షు 5 లక్షల రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. ఆదివారం ప్రసారమైన ఫినాలే ఎపిసోడ్లో లెజెండరీ సింగర్ పి. సుశీల, సూపర్ స్టార్ శృతిహాసన్, నితిన్, క్రితిశెట్టి సమక్షంలో 8 మంది ఫైనలిస్ట్‌లు అద్భుతమైన ప్రదర్శనలతో అందరినీ మైమరిపించారు.
ఈ ఫినాలే స్టేజ్ వేదికగా పి. సుశీల సంగీత ప్రపంచానికి చేసిన సేవలను గుర్తిస్తూ చేసిన సన్మానం ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలవగా, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలలో భాగంగా మాజీ సైనికులకు చేసిన సన్మానం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఫినాలేలో జడ్జీలను తన సింగింగ్‌తో మెప్పించి, టైటిల్ గెలుచుకున్నశృతిక.. బీఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)లో డిగ్రీ పూర్తి చేసింది. ఆరు సంవత్సరాల వయస్సులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి కర్నాటక సంగీతంలో శిక్షణ తీసుకుంది.
ఈ సందర్భంగా శృతిక మాట్లాడుతూ… ‘‘జీ సరిగమప-ది సింగింగ్ సూపర్ స్టార్ విన్నర్‌గా నిలవడం ఒకడ్రీం-కం-ట్రూ మూమెంట్. ఇది నాలైఫ్లోనే బెస్ట్ మూమెంట్. ఎప్పటికీ మరిచిపోలేని క్షణం. ఈ ట్రోఫీని నా కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తాను. నాతోపాటు, నాతోటి ఫైనలిస్టులు కూడా అద్భుతంగా పాడారు. కాబట్టి వారికి కూడా సమానమైన గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఈ సరిగమప జర్నీలో వారు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. వారి దగ్గర నుండి ఎంతో నేర్చుకున్నాను.
అదేవిధంగా, ఈ జర్నీలో నాకు సహకరించిన జీసరిగమప టీం, ముఖ్యంగా మెంటార్స్, జడ్జెస్, వాయిస్ ట్రైనర్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే, నేను సింగర్‌గా ఎదగడానికి ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తున్న మా నాన్న శశికాంత్, అమ్మ రూప, అక్క శరణ్యకి, అలాగే సంగీతంలో ఓనమాలు నేర్పిన నా గురువులు శ్రీరామాచారి కొమండూరి గారికి, శ్రీనిహాల్ కొండూరి గారికి, వసుమతి మాధవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.” అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

