మహిళా దినోత్సవం రోజు మా చిత్రంలో నువు జాయిన్ అవడం సంతోషంగా ఉందంటూ హీరోయిన్ శృతిహాసన్‌ను ఆహ్వానించారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఆయన హీరోగా నటిస్తున్నకొత్త చిత్రంలో శృతి హాసన్ నాయికగా నటిస్తున్నది. దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఇది చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా. పోర్ట్ ఏరియా నేపథ్యంతో తెరకెక్కనుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. శృతిహాసన్‌కు ఫ్లవర్ బొకే అందిస్తున్న చిరంజీవి..ఆ ఫొటోను మంగళవారం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘మహిళా దినోత్సవం సందర్భంగా మా చిత్రబృందంలోకి నిన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉంది. సినిమాకు నువు మహిళాశక్తిని తీసుకొస్తావని ఆశిస్తున్నాం’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.