‘ది ఐ’ చిత్రం ద్వారా గ్లోబల్ ఆడియెన్స్‌ను పలకరించబోతున్నది అగ్ర కథానాయిక శృతిహాసన్. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి డాఫ్నేష్మోన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 27నుంచి మార్చి 2 వరకు ముంబయిలో జరుగనున్న వెంచ్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఈ సినిమా భారత్ తరపున ప్రీమియర్ కానుంది. చనిపోయిన తన భర్తను తిరిగి బతికించుకోవడానికి ఓ మహిళ చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
శృతిహాసన్ మాట్లాడుతూ ‘సైకాలజీ, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో తీసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మహిళలందరూ కలిసి ఈ సినిమాను రూపొందించడం విశేషంగా భావిస్తున్నా. సినీరంగంలో మహిళాసాధికారత ఉండాలనే నా ఆలోచనలకు అనుగుణంగా ఈ సినిమా తయారైంది.’ అని చెప్పింది. ఈ సినిమా ద్వారా శృతిహాసన్ ప్రతిభాపాటవాలు అంతర్జాతీయ స్థాయికి చేరుతాయనే నమ్మకం ఉందని మేకర్స్ తెలిపారు.