SRH vs CSK | చెన్నై ప్రదర్శన ఈ సీజన్లో చాలా చెత్తగా సాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ తాజాగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో చెన్నైకి ఇది ఏడో ఓటమి కావడం గమనార్హం. 9 మ్యాచుల్లో ఏడింటిలో జట్టు ఓడింది కాబట్టి మిగతా అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించినా ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు కష్టమే. అంటే ఈ ఓటమితో సీఎస్కే దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే అని చెప్పాలి. చెన్నై ఓటమిని అభిమానులు అయితే ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు. టీమ్‌ని మార్చిన కూడా జాతకం మారలేదు. చెన్నైని సపోర్ట్ చేసేందుకు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా హాజరైంది. అయితే సొంత గడ్డపై చెన్నై ఓటమి చెందడంతో శృతి హాసన్ కంట కన్నీళ్లు ఆగలేదు.
తన కంటి నుండి వస్తున్న కన్నీళ్లని తుడుచుకుంటూనే శృతి హాసన్ చెన్నై ప్లేయర్స్‌ని ప్రశంసించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. శృతిని ఇలా చూసిన నెటిజన్స్ వామ్మో.. చెన్నై జట్టుకి ఇంత డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారా అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ స్టేడియం లో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ పై దాదాపు 12 ఏళ్ల తర్వాత తొలిసారి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలిచాయి.
మొదట హైదరాబాద్ జట్టు బౌలర్లు విజృంభించడం వల్ల సీఎస్కే జట్టు 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌట్ అయింది. హర్షల్ పటేల్(4/28) సీఎస్కే జట్టును గట్టిగా దెబ్బతీశాడు. చెన్నై జట్టులో డేవాల్డ్ బ్రేవిస్ (42) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆయుశ్ మాత్రే (30), రవీంద్ర జడేజా(21), శివమ్ దూబే(12), ధోనీ(6), నూర్ అహ్మద్(2) మోస్తరు పరుగులు చేశారు. ఇక లక్ష్య ఛేదనలో హైదరాబాద్ కాస్త తడబడిన చివరికి విజయం సాధించింది. 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 44: 5 ఫోర్లు, ఒక సిక్స్), కమిందు మెండిస్ (22 బంతుల్లో 32*: 3 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 19*: 2 ఫోర్లు) మంచి ప్రదర్శన చేశారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉన్నట్టే. ఈ సీజన్ లో ఆరెంజ్ ఆర్మీకి ఇది మూడో విజయం. మిగతా అన్నింటిలోను సన్‌రైజర్స్ గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కి చేరుకుంటుంది.
Don’t worry Shruthi Hassan 😔😭 #CSKvSRH #SRHvsCSK #ShrutiHaasan pic.twitter.com/q1dnpLPiOB
— Telugu Raktham 💪🏻 (@Heart_Legend_) April 26, 2025