Shriya Saran | పెద్ద సీక్రెట్ దాచేసిన శ్రియా..షాక్లో అభిమానులు..!
ఎవరండీ అమ్మాయిలకు సీక్రేట్ తెలిస్తే వెంటనే బయటికి చెప్పేస్తారని చెప్పింది..అలాంటి వాళ్ళకు ఒక్కసారి టాలీవుడ్ (Tollywood) సీనియర్ హీరోయిన్ శ్రియాశరణ్ (Shriya Saran) చూపించండి. ప్రపంచమంతా షాక్ అయిపోయే సీక్రేట్ గుండెల్లోనే దాచేసుకుంది శ్రియాశరణ్

ఎవరండి ఆడవాళ్లు రహస్యాలు దాచిపెట్టలేరు అని చెప్పింది..ఎవరండీ అమ్మాయిలకు సీక్రేట్ తెలిస్తే వెంటనే బయటికి చెప్పేస్తారని చెప్పింది..అలాంటి వాళ్ళకు ఒక్కసారి టాలీవుడ్ (Tollywood) సీనియర్ హీరోయిన్ శ్రియాశరణ్ (Shriya Saran) చూపించండి. అంతా నోరు మూసుకుంటారు.. ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే ఏడాది పాటు ఈమె దాచేసింది చిన్న రహస్యం కాదు.. ప్రపంచమంతా షాక్ అయిపోయే సీక్రేట్ గుండెల్లోనే దాచేసుకుంది శ్రియాశరణ్ . ఈమె అమ్మ అయిన సంగతి కనీసం బయటికి కూడా రానీకుండా 365 రోజులు దాచేసింది. తాజాగా తను పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.
2018లో తన ప్రియుడు ఆండ్రీ కొఛీవ్ (Andrei Koscheev) ను పెళ్లి చేసుకున్న శ్రియ.. అప్పట్నుంచి ఆయనతో కలిసి ఫుల్లుగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. కొఛీవ్భర్తతో ఉన్న ప్రతీక్షణం ఎంజాయ్ చేస్తున్నట్లు అభిమానులతో చెప్తుంది ఈ బ్యూటీ. పైగా ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ అభిమానులతో పంచుకుంటూ బాగోగులు కూడా చెబుతుంది శ్రియాశరణ్ . అలాంటిది తాను గర్భం దాల్చిన సంగతి.. అమ్మాయికి జన్మనిచ్చిన సంగతి మాత్రం చెప్పలేదు. కనీసం అలాంటి న్యూస్ కూడా ఎప్పుడూ పోస్ట్ చేయలేదు శ్రియ. అప్పటికే తన దగ్గర ఉన్న పాత వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులను మోసం చేస్తూనే వచ్చింది.
2020 లో ప్రపంచం అంతా స్థంభించిపోయింది.. ఎంతోమంది కోవిడ్ ధాటికి కన్నుమూసారు కూడా.. అయితే తమకు మాత్రం ఆ దేవుడు మరిచిపోలేని బహుమతిని ఇచ్చాడు. ఓ పండంటి బిడ్డను ప్రసాదించాడని చెప్పడానికి సంతోషిస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రీయ.
దాంతో పాటు తను గర్భంతో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేసింది ఈ భామ. ఇవి చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అయ్య బాబోయ్ శ్రియ ఎప్పుడు గర్భవతి అయింది..ఎప్పుడు పాపకు జన్మనిచ్చింది..ఆ పాపకు ఏడాది వయసు ఎప్పుడొచ్చింది అంటూ ఆశ్చర్యపోతున్నారు. 2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కొఛీవ్ను పెళ్లాడింది శ్రియ.
గతేడాది స్పెయిన్లోని బార్సిలోనాలోనే శ్రియ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అక్కడికి వెకేషన్ కు వెళ్లిన శ్రియ దంపతులు.. లాక్ డౌన్ కారణంగా లాక్ అయిపోయారు. ఏడాది పాటు అక్కడే ఉన్నారు. అదే సమయంలో పాపకు జన్మనిచ్చింది శ్రియ. ఈ విషయాన్ని పాపకు ఏడాది వయసు వచ్చే వరకు దాచేసింది. ఈ మధ్యే మళ్లీ భారత్కు తిరిగి వచ్చేసిన ఈ జంట ముంబైలో ఉంటున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాలో అజయ్ దేవ్గన్ భార్యగా నటిస్తుంది శ్రీయ.
ఇవి కూడా చదవండి..
Mohan Babu | నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు: మోహన్ బాబు
Manchu Vishnu | నాగబాబు రాజీనామా ఆమోదించం: మంచు విష్ణు
Chiranjeevi | మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

