Shriya Saran | అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ నటించిన అట్టర్ ఫ్లాప్ మూవీలలో ఒకటి నా అల్లుడు(Naa Alludu). ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో శ్రియా శరణ్, జెనిలీయా కథనాయికలుగా నటించగా రమ్య కృష్ణన్ హీరోయిన్గా నటించింది. విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన ఈ సినిమాకు వర ముల్లపూడి దర్శకత్వం వహించగా.. ఏ.భారతి నిర్మించాడు. అయితే ఈ సినిమాపై తాజాగా నటి శ్రియా శరణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న శ్రియా శరణ్ నా అల్లుడు నిర్మాత మాకు రెమ్యూనరేషన్ ఇవ్వలేక చెరువులో దూకినట్లు తెలిపింది.
ఎన్టీఆర్, నేను జెనీలియా కలిసి ఒక సినిమాను చేశాం. ఆ మూవీ నిర్మాత చాలా సరదా మనిషి. అయితే షూటింగ్ చివరిరోజు మా రెమ్యునరేషన్ గురించి అడిగేందుకు వెళ్లాం. కానీ అప్పటికే ఆయన హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో దూకేశాడు. అదృష్టవశాత్తూ ఆయనకు ఏం కాలేదు. అక్కడున్న వారు ఆయనను కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ తర్వాత మా సెటిల్మెంట్ గురించి మళ్లీ అడుగలేదు. ఈ విషయం ఇప్పుడు తలచుకున్న ఫన్నీగా అనిపిస్తుంటుంది అంటూ శ్రియా చెప్పుకోచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Actress Shriya about producer difficulties after doing a film called Naa Alludu with jr NTR 🙏🏻pic.twitter.com/iX2z7lfDCo
— RamCharan ERA™ 🚁 (@TeamCharanERA) October 28, 2024