Pa Ranjith – Vettuvam | అక్కినేని కోడలు, నటి శోభితా ధూళిపాళ్ల బంపరాఫర్ కొట్టినట్లు తెలుస్తుంది. పెళ్లికి ముందు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ నాగచైతన్యతో పెళ్లి అనంతరం కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ సినీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది ఈ భామ. తమిళ ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ ఒక సినిమాను తెరకెక్కించబోతుండగా.. ఈ సినిమాలో హీరోయిన్గా శోభితా ధూళిపాళ్లకు అవకాశం దక్కినట్లు తెలుస్తుంది.
తమిళ అగ్ర దర్శకుడిలలో పా.రంజిత్ ఒక్కడు. అట్టకత్తి మద్రాస్, కబాలి, కాలా, సర్పాట్ట పరంబరై, తంగలాన్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు రంజిత్. అయితే తంగలాన్ తర్వాత రంజిత్ వెట్టువం (Vettuvam) అనే ఒక ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో దినేశ్ హీరోగా నటించబోతుండగా.. ఆర్య విలన్ పాత్రలో నటించనున్నాడు. అట్టకత్తి చిత్రం తరువాత వీరి కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. అయితే ఈ సినిమాలోనే శోభితా ధూళిపాళ్లను హీరోయిన్గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే శోభితకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.