Shobha Shetty | కన్నడ బ్యూటీ శోభా శెట్టి తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. కార్తీక దీపం సీరియల్ లో మోనితగా తెలుగు వారికి బాగా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బిగ్ బాస్ ఏడో సీజన్లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది. హౌజ్ లో శివాజీ బ్యాచ్‌కి గట్టిగా ఇచ్చి పడేస్తూ ఫైర్ బ్రాండ్ అనే ముద్ర వేసుకున్న శోభా శెట్టి తన ఆటతో, మాట తీరుతో చాలా మంది అభిమానుల మనసులు గెలుచుకుంది. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు తన ప్రేమ విషయాన్ని కూడా బయటపెట్టింది. యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తితో తాను ప్రేమలో ఉన్నానని తెలియజేస్తూ అందరికి షాక్ ఇచ్చింది.
ఇక హౌజ్ నుండి బయటకు వచ్చాక ప్రియుడితో కలిసి కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేసింది. కొత్తింట్లో సుమారు 16 కలశాలు పెట్టి మధ్యలో శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేసింది. పెళ్లి చేసుకోకుండానే వ్రతాలు, పూజలు చేయడంతో ఆ సమయంలో కొందరు శోభా శెట్టిని ట్రోల్ చేశారు. అయిన ఈ అమ్మడు అవేమి పట్టించుకోలేదు. గత ఐదేళ్లుగా యశ్వంత్ రెడ్డితో రిలేషన్ షిప్లో ఉన్న శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత.. ప్రియుడు యశ్వంత్‌తో నిశ్చితార్థం చేసుకుంది .ఇక వీరి నిశ్చితార్థం చేసుకుని ఏడాది పూర్తి కావడంతో.. పలు ఫొటోలు షేర్ చేసింది.
ఈ ఫొటోలపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నిశ్చతార్థం అయి ఏడాది అయింది.మరి పెళ్లెప్పుడు అని నెటిజన్స్ ఫొటోలకి ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, అగ్నిసాక్షి సీరియల్ లో తను పాత్రలో నటించిన శోభా శెట్టి, నమ్మ రుక్కు సీరియల్ లో కూడా నటించారు. సహనటుడు యశ్వంత్ రెడ్డితో గత సంవత్సరం నిశ్చితార్థం జరుపుకుంది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అని ఆమె ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. గత ఏడాది సరిగ్గా ఇదేరోజు (2024 ఏప్రిల్ 25)న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ బుల్లితెర జోడీ. అయితే నిశ్చితార్థం చేసుకుని ఏడాది పూర్తి కావడంతో.. ఫస్ట్ ఇయర్ ఎంగేజ్మెంట్ ఆనివర్శరీ అంటూ ఫొటోలు వదిలింది శోభాశెట్టి.