Shivarajkumar Plans Documentary On Battle with Cancer | దిగ్గజ నటుడు, కన్నడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్(Shiva rajkumar) ఇటీవల క్యాన్సర్‌తో పోరాడి బయటపడిన విషయం తెలిసిందే. అయితే క్యాన్సర్‌పై ఆయన చేసిన స్ఫూర్తిదాయక పోరాటాన్ని డాక్యుమెంటరీ రూపంలో తీసుకురాబోతున్నట్లు శివరాజ్ కుమార్ భార్య గీతా శివరాజ్‌కుమార్(Geetha Shivaraj kumar) వెల్లడించింది. గతేడాది బ్లాడర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన అమెరికాలోని మయామి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో శస్త్రచికిత్స చేయించుకుని క్యాన్సర్ నుంచి బయటపడ్డారు.
అయితే తన క్యాన్సర్ పోరాటాన్ని డాక్యుమెంటరీ రూపంలో తీసుకురాబోతున్నారు. ఈ ఆలోచన కూడా శివ రాజ్‌కుమార్‌కు చికిత్స చేసిన వైద్యుడు సూచించినట్లు గీతా తెలిపారు. ఈ డాక్యుమెంటరీ ద్వారా శివన్న తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా క్యాన్సర్‌తో బాధపడే వారికి స్ఫూర్తినివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గీతా వెల్లడించింది. ఈ వీడియోలో శివ రాజ్‌కుమార్ యొక్క ధైర్యసాహసాలను, క్యాన్సర్‌తో పోరాడిన తీరును, ఆయన కుటుంబం, అభిమానుల సహకారాన్ని వివరిస్తుందని తెలుస్తుంది.
క్యాన్సర్ నుంచి కోలుకున్న శివన్న రీసెంట్గా ఆర్సీ16 షూటింగ్లో జాయిన్ అయ్యాడు. రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.