Shivangi | తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. హన్మాన్, మ్యాక్స్ చిత్రాలతో ఇటీవల సూపర్హిట్లు అందుకున్న ఈ భామ.. మార్చి 7న ‘శివంగి’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని ఆహా ఎక్స్ వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ మాత్రమే అందుబాటులో రాగా.. రేపటినుంచి తమిళం వెర్షన్ కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఫస్ట్‌కాపీ మూవీస్ పతాకంపై నరేష్ బాబు పి నిర్మించారు. ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు.
సినిమా కథ విషయానికి వస్తే.. సత్యభామ (ఆనంది) ఒకరిని ప్రేమించి, మరొకరిని వివాహం చేసుకుంటుంది. అయితే, పెళ్లైన మొదటి రాత్రే ఆమె భర్త యాక్సిడెంట్‌తో మంచాన పడుతాడు. అదే సమయంలో ఆమె అత్త మాటలతో ఆమెను వేధిస్తుంది. ఇంకోవైపు, ఆర్థిక సమస్యలు ఆమెను వెంటాడుతాయి. ఈ పరిస్థితుల్లో ఆమె మాజీ ప్రియుడు మళ్లీ ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న సత్యభామకు, తన తల్లిదండ్రులు వరదల్లో చిక్కుకున్నారనే మరో వార్త కూడా తెలుస్తుంది.
ఒకే రోజులో అన్ని సమస్యలు సత్యభామను చుట్టుముడతాయి. ఈ సందర్భంలో ఆమె పోలీసులను ఎందుకు ఆశ్రయిస్తుంది. పోలీసు అధికారి అయిన (వరలక్ష్మి శరత్ కుమార్) సత్యభామ ఇంటికి వచ్చి ఏం కనుక్కుంది.. సత్యభామ ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? సత్యభామ సమస్యలు పరిష్కారమయ్యాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే శివంగి సినిమాను చూడాల్సిందే.
Fearless Fierce Unstoppable 👩🏻
Link: https://t.co/1ZjxtPV7w6#Shivangi #VaralaxmiSarathkumar #Anandhi #Johnvijay #AksharaNunna #Bhavanimedia #Bhavanimediatelugu pic.twitter.com/40DOA2s0x3
— Bhavani Media (@BhavaniHDMovies) April 17, 2025