ఇండియాలో ఉన్న ప్రతి హీరోకు తెలుగు మార్కెట్‌పై ఇప్పుడు కన్ను ఉంది. ఎందుకంటే టాలీవుడ్ ఆ రేంజ్లో ఉంది. ఇక్కడ మార్కెట్ సంపాదిస్తే చాలు అనుకుంటున్నారు చాలామంది హీరోలు. అయితే మార్కెట్‌పై చూపించిన శ్రద్ధ తమ సినిమాల టైటిల్స్ విషయంలో మాత్రం అసలు చూపించడం లేదు. తెలుగు మార్కెట్ కావాలని ఇంత పట్టు పడుతున్నా కూడా వాళ్ల సినిమాలకు తెలుగు టైటిల్స్ మాత్రం పెట్టడం లేదు. ఏదో అర్థం పర్థం లేని తమిళ టైటిల్స్‌తోనే వస్తున్నారు. ఇటీవల శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న అయలాన్ సినిమా టీజర్ విడుదలైంది. అసలు ఆ పదానికి అర్థం చాలామందికి తెలియదు. అదొక తమిళ పదం. తెలుగులో సినిమా డబ్బింగ్ చేస్తున్నప్పుడు కచ్చితంగా ఇక్కడ తెలుగు టైటిల్ పెట్టాలి అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా తమిళ టైటిల్‌ను అలాగే తెలుగులో విడుదల చేస్తున్నారు.. అంటూ సినిమా యూనిట్‌పై విమర్శలు భారీగానే వస్తున్నాయి.
మీకు తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చే డబ్బులు కావాలి.. కానీ తెలుగు ప్రేక్షకుల మనోభావాలతో మాత్రం అసలు పని లేదు అంతే కదా.. అందుకే కదా తమిళ టైటిల్ అలాగే తెలుగులో పెట్టి విడుదల చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు సినీ అభిమానులు. తమిళ నిర్మాతలు ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు ఇదే చేశారు. సంక్రాంతికి విడుదలైన అజిత్ తునివు సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో విడుదల చేశారు. అసలు తునివు అంటే ఏంటో ఎవరికి తెలియదు. తెలుగులో దాని అర్థం తెగింపు అని..! చక్కగా అదే పేరు పెట్టి విడుదల చేయొచ్చు కదా అంటూ అప్పుడు చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. కానీ అజిత్ కానీ చిత్ర యూనిట్ కానీ దీని మీద అసలు స్పందించలేదు.
గతేడాది సూర్య నటించిన ఈటీ సినిమాది ఇదే పరిస్థితి అసలు ఈటీ అంటే అర్థం లేనేలేదు. ఏదో అలా పెట్టాలని పెట్టారు అంతే. తెలుగులో వాళ్ల సినిమాలకు ఇంత మార్కెట్ ఉన్నప్పుడు కనీసం ఒక తెలుగు టైటిల్ పెట్టి విడుదల చేయాలనేది మినిమం కామన్ సెన్స్. దాన్ని కూడా వాళ్లు పట్టించుకోకుండా తమిళ టైటిల్‌తో సినిమాలు విడుదల చేస్తే మేము ఎందుకు చూడాలి అంటున్నారు ఆడియన్స్. అదే మన తెలుగు సినిమాలను సేమ్ టైటిల్‌తో తమిళంలో అనువదించి విడుదల చేస్తే అక్కడ ప్రేక్షకులు చూస్తారా.. కనీసం పోస్టర్ మొహం కూడా చూడరు కానీ మన దగ్గర మాత్రం అలాంటి రూల్స్ ఏం పెట్టుకోవడం లేదు. తాజాగా విక్రమ్ హీరోగా పా రంజిత్ తెరకెక్కిస్తున్న తంగలాన్ సినిమా కూడా తెలుగులో అదే టైటిల్‌తో విడుదలవుతుంది. మరి ఈ తమిళ హీరోల్లో మార్పు ఎప్పుడు వస్తుందో చూడాలి..!