Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత బిజీ స్టారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఫ్యామిలీకి ఇవ్వాల్సినంత టైం ఇస్తాడు. ఇతర తెలుగు హీరోలతో పోలిస్తే మహేష్ బాబు తన కుటుంబంతో విదేశీ టూర్స్‌కి ఎక్కువగా వెళ్లే వ్యక్తిగా గుర్తింపు పొందారు. సినిమాలు, ఫ్యామిలీ రెండింటినీ సమర్థంగా మేనేజ్ చేస్తూ ఫ్యామిలీ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రతి సినిమా పూర్తయిన తర్వాత ఫ్యామిలీతో ఓ వెకేషన్‌కు వెళ్లడం ఆయనకు అలవాటే. ఇది ఆయనకు మానసికంగా మంచి రిలీఫ్‌ను ఇస్తుంది.
‘గుంటూరు కారం’ షూటింగ్ టైమ్‌లో మహేష్ బాబుకు వరుసగా వ్యక్తిగత సమస్యలు ఎదురయ్యాయి. ఒకే ఏడాదిలోనే తల్లి ఇందిరా దేవి, తండ్రి కృష్ణ, అన్నయ్య రమేష్ బాబును కోల్పోయాడు. ఈ విషాద సమయంలో కూడా మహేష్ తన బాధను బయటపడనివ్వకుండా, కుటుంబానికి మద్దతుగా నిలిచిన తీరు అసాధారణం. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. మహేష్ తన బాధను లోపలే దాచుకున్నాడు. తాను ఎక్కడా కుంగిపోకుండా కుటుంబానికి బలంగా నిలిచాడు. తల్లిదండ్రులను, అన్నయ్యను కోల్పోయిన తర్వాతా అందరికీ ఆత్మస్థైర్యం ఇచ్చాడు మహేష్ అని శిల్పా తెలిపారు.
ఇక తన సోదరి గురించి మాట్లాడుతూ.. నమ్రత అంటే నాకు చాలా ఇష్టం, ఆమె కూడా నన్ను చాలా స్నేహపూర్వకంగా చూసుకుంటుంది అని చెప్పుకొచ్చింది శిల్పా.. 90లలో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించిన శిల్పా శిరోద్కర్, ఇటీవల బిగ్ బాస్ హిందీ సీజన్ 18లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆమె అప్పుడప్పుడూ మహేష్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ అభిమానులని అలరిస్తూ ఉంటుంది. మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇది SSMB29 పేరుతో ఓ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోంది. 2027లో ఈ చిత్రం విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మహేష్ బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 9న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.