Kubera | గుబురు గడ్డంతో ధనుష్.. కుబేర ఫస్ట్ లుక్ వైరల్
Kubera | టాలీవుడ్లో రాబోతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ శేఖర్‌కమ్ముల(Shekhar Kammula), ధనుష్ (Dhanush) ప్రాజెక్ట్ DNS (వర్కింగ్ టైటిల్). D51గా వస్తోన్న ఈ చిత్రానికి కుబేర Kubera టైటిల్‌ను ఫైనల్ చేశారు. తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
Kubera | టాలీవుడ్లో రాబోతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా ఏదైనా ఉందా.. అంటే అది శేఖర్‌కమ్ముల(Shekhar Kammula), ధనుష్ (Dhanush) ప్రాజెక్ట్. DNS (వర్కింగ్ టైటిల్)తో వస్తోన్న ఈ ప్రాజెక్ట్ లాంఛింగ్ ఫొటోలు కూడా ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. D51గా వస్తోన్న ఈ చిత్రానికి కుబేర (Kubera) టైటిల్‌ను ఫైనల్ చేశారు. తాజాగా మేకర్స్ కుబేర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ధనుష్ చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తుంటే.. బ్యాక్ డ్రాప్లో శివపార్వతుల చిత్రాలను చూడొచ్చు.
ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతుండగా.. శేఖర్ కమ్ముల ఈ సారి ధనుష్‌తో ఏదో భారీ ప్లాన్ చేశాడంటూ తెగ చర్చించుకోవడం మొదలు పెట్టారు నెటిజన్లు, మూవీ లవర్స్. కుబేరలో రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. లవ్‌స్టోరీ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ మూవీని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సోషల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్నట్టు తెలుస్తోండగా.. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ధనుష్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో డీ50వ (D50) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్జే సూర్య ఈ మూవీలో కీ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఈ మూవీ మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
కుబేర ఫస్ట్ లుక్ వైరల్..
#Dhanush in #Kubera – a #shekharkammula film @dhanushkraja pic.twitter.com/Ogmlx1INEm
— Latha Srinivasan (@latasrinivasan) April 16, 2024
DNS షూటింగ్ లొకేషన్ ఫొటోలు..
A blockbuster voyage that’s bound to resonate with the nation! 😎#DNS kicks off with a pooja ceremony and the shoot begins with a key schedule 🎥
More details on the way ⏳@dhanushkraja @iamnagarjuna @iamRashmika @sekharkammula @AsianSuniel @puskurrammohan @SVCLLP pic.twitter.com/bYBtyuwfGA
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) January 18, 2024
3Minitues To Go #D51 #DNS 🔥🔥@dhanushkraja pic.twitter.com/GF1eAXmY4D
— ANANDH DHANUSH VERIYAN (@DhanushianV) January 18, 2024
Buzz about #D50:
• #SJSuryah & #SundeepKishan signed on to portray the role of brothers alongside #Dhanush 🤯🤩
• #VishnuVishal, #DusharaVijayan & #Kalidas undertaking pivotal roles 👏🏻
• The film is set against the backdrop of North Madras 🔥
• Direction: #Dhanush |… pic.twitter.com/FTlh7Ybcv4
— KARTHIK DP (@dp_karthik) May 24, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

