Kuberaa Collections | విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. ఇప్పటికే రూ.80 కోట్లు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం తాజాగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించగా.. ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మించాడు. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్ల మార్క్ దాటిన ఈ చిత్రం 5 రోజుల్లో రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న లక్షల కోట్ల ఖరీదు చేసే ఆయిల్ నిక్షేపాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త నీరజ్(జిమ్ సర్ఫ్) కన్ను పడుతుంది. ప్రభుత్వాన్ని కొని అయినా సరే.. ఆ అయిల్ నిక్షేపాన్ని సొంతం చేసుకోవాలని ప్రయాత్నాలు మొదలుపెడతాడు నీరజ్. ప్రభుత్వ పెద్దలను లక్ష కోట్లు ఎర వేయడంతో.. వాళ్లు నీరజ్‌కు సముద్రాన్ని రాసిస్తారు. ఆ లక్షకోట్ల నల్ల ధనం ప్రభుత్వ పెద్దలకు చేరాలంటే ముందు అది వైట్ మనీగా మారాలి. అలా మార్చగల ఒకేఒక్క వ్యక్తి సీబీఐ ఆఫీసర్ దీపక్(అక్కినేని నాగార్జున). కొందరి కుట్రల వల్ల అన్యాయంగా జైలు శిక్ష అనుభవిస్తున్న దీపక్‌ను ఈ విషయంలో సాయం కోరతాడు నీరజ్. జైలు నుంచి విడిపించడమే కాక, కావాల్సినంత డబ్బు కూడా ఇస్తామనడంతో.. స్వతహాగా నిజాయితీ పరుడైన దీపక్.. కుటుంబం కోసం నీరజ్‌తో తప్పక చేయి కలుపుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నాలుగు బినామీ ఖాతాలలో లక్ష కోట్లు బదిలీ చేయాలని ప్లాన్ చేస్తారు. దాని కోసం నలుగురు బెగ్గర్లను సెలక్ట్ చేస్తారు. వారిలో దేవ(ధనుష్) ఒకడు. మరి దీపక్ ప్లాన్ వర్కవుట్ అయిందా? అసలు ఈ కథలో దేవా పాత్ర ఏంటి? దేవాకూ, దీపక్కూ మధ్య సంబంధం ఏంటి? పారిశ్రామిక వేత్త నీరజ్ ప్రయత్నం సఫలమైందా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
Wealth. Wisdom. And now… ₹100+CR worth of WAVE 🌊#Kuberaa rules with a grand century at the box office.🔥
Book your tickets now: https://t.co/4LlzXfPwzT #Kuberaa#BlockBusterKuberaa #SekharKammulasKuberaa #KuberaaInCinemasNow pic.twitter.com/xKr1UYXP60
— Kuberaa Movie (@KuberaaTheMovie) June 25, 2025