Pawan Kalyan – Sayaji Shinde | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు ప్రముఖ నటుడు షాయాజీ షిండే. ఇటీవల ఒక సినిమా ఫంక్షన్లో షాయాజీ షిండే మాట్లాడుతూ.. ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందంటూ పవన్ కళ్యాణ్‌కు కోరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పవన్‌ను కలిసి తన ఆలోచనలను పంచుకుంటానని చెప్పారు. అయితే ఈ విషయం పవన్ దృష్టికి రాగా.. తాజాగా షాయాజీ షిండేతో భేటి అయ్యారు.
మంగళగిరిలోని పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి ఈ సమవేశం జరుగగా.. ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఓ మొక్క కూడా ఇస్తే బాగుంటుంది అన్న విషయంపై పవన్‌తో చర్చించారు. ఇక షాయాజీ షిండే చేసిన విజ్ఞప్తికి పవన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.