ఎగిలివారంగ లేసి.. ఇల్లలికి పూదిచ్చి దిగుట్ల దేవతలకు దీపాలే ముట్టిచ్చి..
1960 దశకం ఆదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారు. కేకే రాధామోహన్ నిర్మాత. ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది.
1960 దశకం ఆదిలాబాద్-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారు. కేకే రాధామోహన్ నిర్మాత. ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. శుక్రవారం ఈ సినిమాలోని ‘ఏగిలివారంగ లేసి..’ అనే పాటను విడుదల చేసి మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు. చంద్రబోస్ రచించిన ఈ గీతానికి భీమ్స్ సిసిరోలియో స్వరాల్ని అందించారు. నల్గొండ గద్దర్ ఈ పాటను ఆలపించారు. ‘ఎగిలివారంగ లేసి.. ఇల్లలికి పూదిచ్చి.. దిగూట్ల దేవతలకు దీపాలే ముట్టిచ్చి..
కొట్టంలో బర్లూగొడ్లకు కుడితినే తాపిచ్చి.. పజ్టొన్న గడకలోకి సల్లా నీళ్లేబోసి..’ అంటూ అచ్చ తెలంగాణ పల్లె మాండలికంలో అక్కడి గ్రామీణ జీవితం, కులవృత్తులు, సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ ఈ పాట సాగింది. చంద్రబోస్ అద్భుత సాహిత్యం, భీమ్స్ సిసిరోలియో చక్కటి బాణీ, నల్గొండ గద్దర్ గళం కలబోతగా ఈ పాట తెలంగాణ మట్టిపరిమళాల్ని వెదజల్లింది. 1960ల నాటి గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: సంపత్‌నంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

